కె.ఎ.పాల్ బయోపిక్‌లో ట్రంప్ కనిపిస్తాడట!!
on Jul 11, 2019
ఇటీవల కాలంలో కె.ఎ.పాల్ బయోపిక్ సినిమా రానుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కె.ఎ.పాల్ పాత్రలో సునీల్ నటించబోతున్నాడంటూ కూడా న్యూస్ వచ్చాయి. అయితే మొదట్లో దీన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ , ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ వార్తే నిజమే అని తేలింది. ఓ న్యూ డైరక్టర్ కె.ఎ.పాల్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాను చాలా వరకు అమెరికాలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కథలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలినా జోలీ కనిపించాలట. ఇందులో కోసం అచ్చం వారిలో పోలి ఉండే ఇద్దరిని సెలక్ట్ చేసారట దర్శకుడు. ఈ సినిమా మేకోవర్ కోసం హాలీవుడ్ మేకప్ మ్యాన్ ని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం సునీల్ క్యారక్టర్ కు సంబంధించిన మేకోవర్ టెస్ట్ అమెరికాలో జరుగుతోందట. అందుకే ఇటీవల సునీల్ అమెరికా వెళ్లాడట. తిరిగివచ్చాక సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read