బిగ్ బాస్ 2 .. వికెట్ నెంబర్ 3
on Jul 2, 2018
బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది.. ఇప్పుడు ప్రసారం అవుతున్న రెండో సీజన్ కి నాని హోస్ట్ గా చేస్తున్నాడు.. రెండో సీజన్లో ఒక సర్ ప్రైజ్ కూడా ఉంది.. అదే సామాన్యులకి కూడా ఈ సీజన్లో అవకాశం.. కానీ అనూహ్యంగా మొదటి రెండు వారాలు సామాన్యులు ఎలిమినేట్ అయ్యారు.. మొదటివారం సంజన ఎలిమినేట్ కాగా, రెండోవారం నూతన నాయుడు ఎలిమినేట్ అయ్యారు.. దీంతో కొందరు ' సామాన్యులని కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారని విమర్శించారు'.. మరికొందరు 'మూడోవారం గణేష్ ఎలిమినేట్ అవుతాడని ఊహించారు'.. కానీ వారి ఊహలు నిజం కాలేదు.. అందరికి దగ్గర అవ్వాలనుకొని చివరికి ఒంటరిగా మిగిలిపోయిన కిరీటి ఎలిమినేట్ అయ్యాడు.. బిగ్ బాస్ సీజన్ 2 లో మొదటి రెండు వికెట్లు సామాన్యులు కాగా, మూడో వికెట్ కిరీటి అయ్యాడు.