రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా భూత్
on Apr 19, 2014
ఓటు విలువను తెలిపే విధంగా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "భూత్ నాథ్ రిటర్న్స్". ఈ చిత్రాన్ని రాష్ట్రపతి భవన్ లో ఇటీవలే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం అమితాబ్ మాట్లాడుతూ... "రాష్ట్రపతి సినిమాను చూసి చాలా ఆనందించారు. సినిమా అయ్యాక మా బృందాన్ని మెచ్చుకున్నారు" అని అన్నారు. ఆ తర్వాత అమితాబ్, దర్శకుడు నితేష్, నిర్మాతలు రేణు చోప్రా, భలేరావులకు రాష్ట్రపతి జ్ఞాపికల్ని బహుకరించారు.