7 అంకెకు భూమికకు లింకేటి?
on Dec 29, 2017
కరణాకరన్ ‘యువకుడు’ సినిమాతో హీరోయిన్ గా పరిచమైన భూమికకు... ఆమె జనరేషన్లో ఏ హీరోయిన్ కీ లేని రికార్డు ఉంది. అదేంటంటే.... పవన్ కట్యాణ్ 7వ చిత్రం ‘ఖుషీ‘ కథానాయిక భూమిక. పవర్ స్టార్ కెరీర్లోనే ఆ సినిమా మెమరబుల్ హిట్. అలాగే... హీరోగా మహేశ్ బాబు 7వ చిత్రం ‘ఒక్కడు’ కథానాయిక భూమిక. ఈ సినిమా కూడా మహేశ్ కెరీర్లో మెమరబుల్ హిట్. ఓ విధంగా మహేశ్ కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ ‘ఒక్కడు’. హీరోగా తారక్ 7వ చిత్రం ‘సింహాద్రి’ కథానాయిక కూడా భూమికే. ఈ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా ‘సింహాద్రి’. ఎన్టీయార్ కెరీర్ ని సమూలంగా మార్చేసిన సినిమా ఇది.
ఆ విధంగా ముగ్గురు టాప్ హీరోల మెమరబుల్ హిట్స్ లో కథానాయికగా నటించిన క్రెడిట్ భూమికే దక్కుతుంది. ఈ మూడు సినిమాలూ ఆ హీరోల 7వ సినిమాలు కావడం ఇక్కడ యాదృశ్చికం. అంతేకాదు... ప్రస్తుతం వదిన పాత్రలకు టర్న్ అయి... తొలి ప్రయత్నంగా నాని ‘ఎంసీఏ’ సిినిమాలో వదిన పాత్ర పోషించింది. ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ వచ్చినా... వసూళ్ల పరంగా టాక్ తో సంబంధం లేకుండా ఆడుతోంది. విశేషం ఏంటంటే... ఈ సినిమా వరుసగా నాని అందుకున్న 7వ విజయం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తుంటే... ‘7‘ అంకెకు భూమికకు ఏదైనా సంబంధ: ఉందా అనిపిస్తుంది. అంతెందుకు కథానాయికగా భూమిక 7వ సినిమా ‘ఒక్కడు’. అది ఎంత పెద్ద హిట్టో తెలిసిందేగా. నిజంగా ఇదొక మిరాకిల్ గా లేదూ.