చిరంజీవి టైటిల్ తో బెల్లంకొండ!!
on Apr 4, 2019
యువ కథానాయకుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సాయి శ్రీనివాస్ తాజా చిత్రం `సీత` ఈ నెల 25న విడుదలకు సిద్దమవుతుండగా మరోవైపు తమిళ బ్లాక్ బస్టర్ మూవీ `రాక్షసన్` రీమెక్ కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. `రైడ్` ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం లో కోనేరు సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తోందని సమాచారం.
ఇదిలా ఉంటే చిత్ర కథానుసారం ఈ సినిమాకి `రాక్షసుడు` అనే టైటిల్ ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందని టాలీవుడ్ టాక్. గతంలో ఇదే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. 1986లో వచ్చిన నాటి `రాక్షసుడు` మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇక ఇదే టైటిల్ తో నాలుగేళ్ళ క్రితం సూర్య హీరోగా తమిళ డబ్బింగ్ మూవీ కూడా వచ్చింది. మరి ఈ టైటిల్ తోనే సాయి శ్రీనివాస్ వస్తాడా ? లేదంటే మరో టైటిల్ అవుతుందా ? అన్న విషయం పై త్వరలోనే క్లారిటీ వస్తుంది.