English | Telugu

యంగ్ హీరోతో కాజల్..!!

on Jul 10, 2018

 

కాజల్.. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చందమామ.. చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకొని.. పక్కా లోకల్ అమ్మాయిలా తెలుగువాళ్ళకు దగ్గరైంది.. ప్రస్తుతం కాజల్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.. కాజల్, తేజ దర్శకత్వంలో గతంలో లక్ష్మీకళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు చేసింది.. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమైంది కాజల్.. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో.. శ్రీనివాస్ తన మొదటి సినిమా నుండి ఎక్కువగా స్టార్ హీరోయిన్లతోనే జతకడుతున్నాడు.. మరోసారి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఇప్పుడు కాజల్ తో జతకడుతున్నాడు.. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్రమం జరిగింది.. వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, శ్రీవాస్ కెమేరా స్విచ్చాన్ చేశారు.. చూద్దాం మరి శ్రీనివాస్,కాజల్ జంట తెరమీద ఎంత సందడి చేసిందో.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here