English | Telugu

`బంగారు బుల్లోడు` గా గోపిచంద్!!

on Jun 8, 2019

 

గోపిచంద్ హీరోగా తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌ల ఇండో పాక్ బార్డ‌ర్ లో షూటింగ్ జ‌రుపుకుంటుండగా హీరో గోపిచంద్ కు గాయమ‌వ‌డంతో కొన్ని రోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ఇక గోపిచంద్ కు గాయం మాన‌డంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ మ‌రో రెండు రోజుల్లో హైద‌రాబాద్ లో ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే యాభైశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించుకోనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓ ఇంట్ర‌స్టింగ్ టైటిల్ పెట్ట‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.  ఇక గ‌తంలో బాల‌య్య న‌టించిన హిట్ చిత్రం `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ని గోపిచంద్ సినిమాకు ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లో దీనిపై ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.  మెహ‌రీన్ కౌర్ జ‌రీనాఖాన్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ ఏడాది ఆఖ‌రులో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు . ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ గోపిచంద్ సినిమాలు వ‌చ్చేవి. తొలిసారి ఒక అల్ల‌రి టైటిల్ తో గోపిచంద్ వ‌స్తున్నాడు. మ‌రి ఈ సినిమా అయినా గోపిచంద్ ను స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూద్దాం. 

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here