English | Telugu

బాలయ్య తండ్రి అట! పవన్‌తో మాత్రం చనువెక్కువట!

on Jan 9, 2018

హీరోయిన్లు... హీరోల భజనం చేయడం కామనే. ఈ సారి కూడా అలాగే భజన కార్యక్రమం జరిగింది. అయితే... ఇక్కడ వెరైటీ ఏంటంటే... సంక్రాంతి హీరోలిద్దరీనీ.. సంక్రాంతి హీరోయిన్లు భజన చేయడం. ఈ సంక్రాంతి సినీ పందాల్లో కోడి పుంజులు ఎవరు? అనడిగితే... టక్కుమని వచ్చే సమాధానం పవన్ కల్యాన్, బాలకృష్ణ. వీరిద్దరి సినిమాలూ రెండు రోజుల తేడాతో విడుదల కానున్నాయ్. ఇదిలావుంటే... ‘అజ్ఙాతవాసి’ హీరోయిన్ అనూ ఇమ్మానియేల్... పవన్ గురించి, ‘జై సింహ’ కథానాయిక నయనతార.. బాలయ్య గురించి రకరకాల సందర్భాల్లో విచిత్రంగా స్పందించారు. 

‘పవన్ చాలా మంచి మనిషి. ఆయనుంటే లొకేషన్ అంతా సరదాసరదాగా ఉంటుంది. అదేంటో... ఆయన లొకేషన్లో అందరికంటే నా దగ్గరే చనువుగా ఉండేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను’ అని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో అను చెప్పుకొచ్చింది. ఇక నయనతార అయితే... బాలయ్యపై ఎవరూ  ఊహించని కామెంట్లే చేసింది.  ‘బాలయ్య సార్... నిజంగా గ్రేట్. ఈ వయసులో కూడా యంగ్ స్టర్స్ కి పోటీపడి మరీ నటిస్తున్నారు. ఆయన చూస్తే నాకు తండ్రిలా అనిపిస్తారు. సెట్ లో ఆయనొస్తుంటే.. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది నయన. బావుంది కదూ... వీరి భజన   


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here