ట్రైలర్ రివ్యూ: బాలకృష్ణుడు
on Nov 11, 2017
టాలీవుడ్లో సెలక్టివ్ కథలతో.. సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు చేసే అతికొద్ది మంది హీరోల్లో నారా రోహిత్ ఒకరు. బాణం, ప్రతినిధి, అసుర, రాజా చెయ్యి వేస్తే, అప్పట్లో ఒకడుండే వాడు.. ఇలా ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం.. ఈ పయనంలో ఫ్లాపులు వచ్చినా తన పంథాను మార్చుకోలేదు రోహిత్. తాజాగా పవన్ మల్లెల దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా బాలకృష్ణుడు.. ఈ మూవీ థియెట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది యూనిట్. ఫ్యాక్షన్ నేపథ్యం, ఓ ఫ్లాష్ బ్యాక్, ప్రమాదంలో ఉన్న హీరోయిన్ను కాపాడే హీరో, కామెడి ఇలా ట్రైలర్ చూస్తుంటే.. ఇది పక్కా కమర్షియల్ ఫార్ములా మూవీ అని అర్థమైపోతుంది. శివగామి రమ్యకృష్ణ మరోసారి ఓ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నారో రోహిత్‌కు జోడిగా రెజీనా నటించింది.. మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.