బాలయ్య టైటిల్ తో నాగ శౌర్య
on Jun 30, 2018
చందమామకథలు సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగ శౌర్య, ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా యువతని ఆకట్టుకుంటున్న ఈ యువ హీరో.. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమాకి రాజా కొలుసు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమాలో నాగశౌర్య ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడట.. అయితే ఈ సినిమాకి టైటిల్ గా బాలయ్య హిట్ సినిమా టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.. అప్పట్లో బాలయ్య 'నారి నారి నడుమ మురారి' సినిమాతో ఘన విజయం సాధించారు.. ఇదే టైటిల్ తో నాగశౌర్య కూడా మంచి విజయం సాధించాలి అనుకుంటున్నారట..చూద్దాం నాగశౌర్య ఇద్దరి భామలతో , నారి నారి నడుమ మురారి అంటూ ఎలా ఆకట్టుకుంటారో.