కొత్త ఏడాదిలో బాలకృష్ణ కొత్త సినిమా
on Nov 9, 2019
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుది హిట్ కాంబినేషన్. 'సింహా', 'లెజెండ్' బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరిద్దరూ హ్యాట్రిక్ పై గురి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ 'రూలర్' షూటింగ్ చేస్తున్నారు. 'జై సింహా' తర్వాత కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రమిది. డిసెంబర్ 20న విడుదల కానుంది. బోయపాటి శ్రీనుకు అటు ఇటుగా అదే వారంలో ఫస్ట్ క్లాప్ కొట్టనున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు. షూటింగ్ మాత్రం కొత్త ఏడాదిలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. బహుశా... సంక్రాంతి తర్వాత షూటింగ్ స్టార్ట్ కావొచ్చు. ఇందులో బాలకృష్ణ పక్కన ఒక్క హీరోయినే ఉంటుందట. 'సింహా', 'లెజెండ్' టైపులో ఈ సినిమాలోనూ బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తారట. బోయపాటి శ్రీనుతో 'జయ జానకి నాయక' నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.
Also Read