బాలచందర్ అంత్యక్రియలు పూర్తి
on Dec 24, 2014
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ అంత్యక్రియలు చెన్నయ్ లోని బీసెంట్ నగర్ స్మశానవాటికలో ముగిశాయి. రజనీకాంత్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారమైన మనసులతో తమ అభిమాన దర్శకుడికి తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు బాలచందర్ నివాస గృహంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బాలచందర్కి అంతిమ నివాళులు అర్పించారు.