ట్రైలర్ రివ్యూ: బాబు బాగా బిజీ
on Mar 23, 2017
బోల్డ్ కంటెంట్‌తో సినిమాలు తీయడంలో బాలీవుడ్ తరవాతే ఎవరైనా. దిల్లీ బిల్లీ , బిఏ పాస్, కామసూత్ర... లాంటి కథలు కోకొల్లలుగా వస్తాయి. మసాలా జోడించి.. కుర్రకారుని ఆకట్టుకొనే టెక్నిక్ అక్కడి జనాలకు బాగా తెలుసు. అదే కోవలో బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం.. హంటర్. అమ్మాయిలు, సెక్స్ అంటే పిచ్చెక్కిపోయే ఓ కుర్రాడి కథ ఇది. తన జీవితంలో ఎదురుపడిన అమ్మాయిలు, వాళ్లతో తన రాసలీలలతో సాగిన చిత్రమిది. తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో రీమేక్ చేశారు. అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది.. అది చాలా హాట్ హాట్‌గా కనిపిస్తోంది.
మాతృకలో చాలా బోల్డ్‌గా తీసిన సీన్లు... అంతకంటే ఎక్కువ హాట్‌గా తీసినట్టు కనిస్తోంది. కొన్ని డైలాగులు వింటుంటే... ఈసినిమాని ఫ్యామిలీతో కలసి ఎట్టిపరిస్థితుల్లోనూ చూళ్లేం అనిపిస్తుంది. యూత్‌కి గాలమేశాలా సన్నివేశాల్ని తెరకెక్కించారు.. అమ్మాయిల్నీ, అంటీలనూ వల్లో వేసుకొనే మన్మథుడి పాత్రలో అవసరాల శ్రీనివాస్ జీవించేశాడనే చెప్పాలి. తేజస్వినిని ఐస్ క్రీమ్ అనుకొన్నట్టు నాలికతో.. రుచి చూసే షాట్ అయితే అమ్మో అనిపించేలా ఉంది. ట్రైలర్‌తో.. యువతని థియేటర్లకు రప్పించే మంత్రమైతే వేసేశారు దర్శక నిర్మాతలు. అయితే ఇలాంటి సినిమాలు చూసీ చూసీ అలవాటు పడిపోయిన యూత్‌కి.... ఎంత వరకూ ఆకట్టుకొంటుందో చూడాలి.