రాజమౌళికి ప్రశంసల వెల్లువ
on Mar 16, 2017
బాహుబలితో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి..బాహుబలి ప్రభంజనంతో అప్పటిదాకా ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోయాయి. బాహుబలికి సీక్వెల్‌గా బాహుబలి-2ని తెరకెక్కించి మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు రెడీ అయ్యారు జక్కన్న. టాలీవుడ్‌తో పాటు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం బాహుబలి ద కన్‌క్లూజన్ కోసం వెయిట్ చేస్తోంది.
తాజాగా ఇవాళ బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్ చేసింది ఆ సినిమా యూనిట్. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలి టీంని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జక్కన్నకి అభినందనలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్, సమంత, రామ్, సందీప్ కిషన్, వెన్నెల కిశోర్ తదితరులు ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.