రాజమౌళిని ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నాడు..?
on Mar 16, 2017
బాహుబలి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా అంటే ఇది అని ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పుకునేలా చేసింది ఈ సినిమా. అలాంటి సినిమాకు సిక్వెల్ వస్తుంది అంటే ఏ రేంజ్లో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని ప్రకటించడంతో టాలీవుడ్ మొత్తం అటెన్షన్ అయ్యింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలి టీంకి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని టాలీవుడ్ ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజమౌళితో హ్యట్రిక్ సినిమాలు తీసిన జూనియర్ ఎన్టీఆర్" గతంలో ఎప్పుడు తెలియని అనుభవం మీ నాడి వేగం పెరుగిపోతుంది..ఊపిరి ఆగిపోతుంది..కన్ను రెప్ప కూడా వేయలేరు " అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్, సమంత, రామ్, సందీప్ కిషన్, వెన్నెల కిశోర్ ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.