బాహుబలి-2 ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్
on Mar 26, 2017
బాహుబలి ద కన్‌క్లూజన్ ఫ్రి రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైలెట్స్ చూస్తే.
* ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కోసం ఒక్కొపాటను షూట్ చేసి వారికి అంకితం చేశారు.
* ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని..షూటింగ్ పార్ట్ మాత్రమే పూర్తయ్యిందని..విజువల్ ఎఫెక్ట్స్ తమ చేతికి వస్తే కానీ సినిమా
పూర్తయినట్లుగా తాను భావించడం లేదన్నారు రాజమౌళి
* తన తమ్ముడు రాజమౌళిని ఆశీర్వదిస్తూ కీరవాణి ఓ పాట పాడారు.
* అన్నయ్య నోటి వెంట పాట రాగానే వేదిక మీద ఉన్న రాజమౌళీ ఒక్కసారిగా కంటతడి పెట్టారు.
* తెలుగు సినిమా స్థాయి పెరిగింది అని చెప్పడానికి బాహుబలి నిదర్శనమన్నారు కెమెరామెన్ సెంథిల్ కుమార్.
* బాహుబలి భారతీయ సినిమా మీద ఎంతో ప్రభావం చూపిందన్నారు నటుడు సుబ్బరాజు
* సత్యరాజ్ కంటే తన పేరు కట్టప్పగానే భారతదేశం మొత్తం గుర్తిస్తుందన్నారు సత్యరాజ్.
* తనను అంతా తెలుగుమమ్మాయిగానే గుర్తిస్తున్నారని ముద్దుగా చెప్పింది తమన్నా
* స్పిల్బర్గ్ బాహుబలిని చూసి ఇండియన్ మూవీ గురించి మాట్లాడమని ఆయనకు చెబుతానన్నారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు.
* మొఘల్ ఏ ఆజమ్ తర్వాత మళ్లీ భారతీయ సినిమాను తతెత్తుకునేలా చేసిన సినిమా బాహుబలినే అన్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్
* చాలా మంది హీరోల్లాగా ప్రభాస్‌లో గర్వం లేదన్నారు సంగీత దర్శకుడు కీరవాణి.
* తనకు ఎప్పటికీ ప్రభాసే ఫేవరేట్ కోస్టార్ అన్నారు భల్లాలదేవుడు రానా.
* చివర్లో రెండు డైలాగ్స్‌తో పాటు అందరికీ థాంక్స్ డార్లింగ్స్ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు ప్రభాస్.