బాహుబలి 2 ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి
on Apr 29, 2017
పండగ లేదు పబ్బం లేదు, వేరే ఏ ఇతర హాలిడేస్ లేవు... స్కూల్స్ మరియు కాలేజీ లకి వేసవి సెలవులు తప్ప. కానీ, బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలు కలుపుకొని 180 కోట్లు కొల్లగొట్టి, ట్రేడ్ వర్గాలని ఆశ్ఛర్యానికి గురి చేసింది. ఒక తెలుగు సినిమా ఏంటి ఇంత కలెక్ట్ చేయడమేంటి అని ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంక చెప్పాలి అంటే, ఏ ఇద్దరు కలిసినా బాహుబలి ముచ్చట్లే. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ సినిమాలని తలదన్నేలా, బాహుబలి తన విశ్వరూపం ప్రదర్శించింది. ఇండియా వ్యాప్తంగా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేయగా, కేవలం హిందీ వర్షనే 40 కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 42 .23 కోట్ల షేర్ సాధించి, ఇంతకు ముందు రికార్డుని బద్దలు కొట్టింది. ఇంక ఓవర్సీస్ విషయానికి వస్తే, మొదటి రోజు 2 .26 మిలియన్ డాలర్లు సాధించిన బాహుబలి 2 , వారాంతానికి 9 .5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. బాహుబలి 2 ప్రభంజనం కేవలం తెలుగువాడే కాదు, భారతీయులందరు గర్వంగా చెప్పుకునే విషయం.