ఫిల్మ్ సిటీలో నాయికలతో బాలయ్య
on Nov 20, 2020
సింహా, లెజెండ్ వంటి సెన్సేషనల్ మూవీస్ తరువాత నటసింహ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విరామం తరువాత ఇటీవలే ఓ షెడ్యూల్ ని పూర్తి చేశారు. కాగా తాజా షెడ్యూల్ ని శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టారట.
ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు చిత్ర కథానాయకులు సాయేషా సైగల్, పూర్ణ కూడా పాల్గొంటున్నారట. ఫిల్మ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో ఈ ముగ్గురిపై కొన్ని కీలక సన్నివేశాలు పిక్చరైజ్ చేస్తున్నారని సమాచారం. అటు పూర్ణ, ఇటు సాయేషాతో బాలకృష్ణకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. 2021 వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
