అరవింద సమేత ట్రైలర్ రివ్యూ
on Oct 2, 2018
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో సినిమా అనగానే ఎన్టీఆర్ అభిమానులే కాదు.. యావత్తు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. సినిమా మీద ఆసక్తిని రెట్టింపు చేసాయి. దీంతో ట్రైలర్, సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూసారు. ఎట్టకేలకు ట్రైలర్ ప్రేక్షకులను పలకరించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని అంచనాలను ఆకాశానికి తాకేలా చేసాయి. 'మీ పేరు' అని ఎన్టీఆర్, హీరోయిన్ పూజను అడగడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. దానికి బదులుగా పూజ 'చాలా.. అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా కావాలా' అని చెప్తుంది. ఇలా ఇద్దరి మధ్య క్యూట్ లవ్, బ్యూటిఫుల్ మ్యూజిక్ తో సాగుతూ. ఒక్కసారిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి వెళ్తుంది. 'భద్రప్ప ఈడ మంద లేరా? కత్తులు లేవా?' అంటూ ఎన్టీఆర్ నోటి వెంట వచ్చే ఈ మాట రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.
ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న షాట్స్ అయితే ఆది, సింహాద్రి రోజులను గుర్తు చేసాయి. ఇక అలా యాక్షన్ కాస్తా, మళ్ళీ ఎమోషన్ గా టర్న్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కలగలిపి ట్రైలర్ ఒక విందు భోజనంలా ఉంది. అదేవిధంగా థమన్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అరవింద సమేత ట్రైలర్ త్రివిక్రమ్ కలం బలం, ఎన్టీఆర్ అభినయం కలగలిసిన ఓ అద్భుతం. మరి సినిమా కూడా ట్రైలర్ లాగానే ఆకట్టుకుంటుందేమో చూద్దాం.