వీరిద్దరి మధ్య వ్యవహారం నిజమేనా?
on Nov 10, 2017
‘మీడియా అనుకుంటున్న దానికీ... వీళ్లు చేస్తున్న దానికీ బాగా సరిపోయింది.’... ఫిలిం సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే మాట. ఇంతకీ ఎవరు వాళ్లు? అనేగా మీ ప్రశ్న. ఇంకెవరు బాహుబలి, దేవసేన. అదేనండీ... ప్రభాస్, అనుష్క. ఇంతకీ వీరు ఏం చేశారనేగా మీరడిగేది. ఆ విషయం చెప్పేముందు.. కొన్ని విషయాలు చెప్పాలి. వీరిద్దరి మధ్య వ్యవహారం నడుస్తోందని చాలా రోజులుగా మీడియా కోడై కూస్తూనే ఉంది. కొందరైతే.. ఒకడుగు ముందుకేసి ‘త్వరలో పెళ్డాడబోతున్నారు’ అంటూ న్యూసులు కూడా రాసేశారు. అంతర్జాతీయ ఛానల్స్ కూడా వీరి పెళ్లి గురించి చెప్పేసుకున్నాయ్. కానీ.. వీరు మ ాత్రం ఖండించారనుకోండి అది వేరే విషయం. ఈ ఖండనలు బాగానే ఉన్నాయి. కానీ.. ఈ చేతలేంటి? అని. వీటిని ఎలా తీసుకోవాలీ.. అని? మొన్నామధ్య ప్రభాస్ పుట్టిన రోజు వచ్చింది.
ఈ సందర్భంగా అనుష్క ఓ రిస్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చేసింది. ‘నేను ఎంతగానో ప్రేమిస్తున్న... నాకెంతో ఇష్టమైన డార్లింగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని సోషల్ మీడియాలో కామెంట్ కూడా పెట్టింది. ఏముందిలే ఏదో క్యాజువల్ గా పెట్టి ఉంటుందిలే అని అనుకునేలోపే.. రీసెంట్ గా అనుష్క పుట్టిన రోజు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్ ట్వీట్ చేశాడు. ‘మా జేజెమ్మకు జన్మదిన శుభాకాంక్షలు’ అని. అంతటి ఊరుకుంటే బావుండేది. ఏకంగా ఓ బిఎండబ్ల్యూ కారును గిఫ్ట్ గా కూడా ఇచ్చాడట. దీంతో ఫిలిం సర్కిల్స్ లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. పుట్టిన రోజైతే.. గిఫ్టులివ్వడం కామెనే కానీ.. మరీ బీఎండబ్ల్యూ కారు ఇచ్చేస్తారా? దీన్ని ఎలా తీసుకోవాలి? అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ అసలు వీరిద్దరి మధ్య ఉన్నదేంటి చెప్మా?