మాట రాని మౌనమిది అంటోన్న అనుష్క!!
on Mar 27, 2019
మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు అంటూ ఓ సినీ కవి రాసాడు. ఇప్పుడు అనుష్క కళ్లు పలికే ఊసులను సిల్వర్ స్ర్కీన్ పై చూడబోతున్నాం. మీరు విన్నది నిజమే. అనుష్క ప్రజంట్ `సైలెన్స్` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె మూగతో పాటు చెవుడు ఉన్న పాత్రలో నటిస్తోందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదో ఒక లోపంతో ఉన్న పాత్రను తీసుకుని దానికి ఎమోషన్స్ జోడించి సందేశాత్మక, వినోదాత్మక చిత్రంగా మలుస్తున్నారు. ఆ తరహాలోనే `సైలెన్స్` చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క చెవుడు, మూగ భాషకు సంబంధించిన శిక్షణ అమెరికాలో తీసుకుంటుందట. కేవలం సైగలతో, ముఖ కవళికలతోనే తన పాత్రను పండించాలి అనుష్క. అందుకే ఆ పాత్రకు సంబంధించిన కసరత్తులు చేస్తోందట. `భాగమతి `చిత్రం తర్వాత బరువు తగ్గడానికి చాలా అవస్థలు పడ్దది ఈ అమ్మడు. విదేశాలకు వెళ్లి అక్కడ నిపుణుల సమక్షంలో బరువు తగ్గింది. ఇప్పుడు సన్నగా నాజూకుగా తయారైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో `సైలెన్స్` సినిమా రూపొందుతోంది. ఇందులో రానా గెస్ట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.