అనుష్కకి ఏమైంది?
on Jul 10, 2017
బాలీవుడ్ భామ అనుష్కా శర్మది ఓ డిఫరెంట్ స్టైల్. ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయదు తను. మనసుకు నచ్చాలి. నటనకు స్కోప్ ఉండాలి... అప్పుడే ఆ సినిమాలో నటిస్తారు అనుష్క. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలే అందుకు నిదర్శనాలు.
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా‘పరి’. ఆ సినిమాకు నిర్మాత కూడా అనుష్కే. ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ ని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆసక్తిని రేకెత్తించేలా ఉందా స్టిల్. ఇందులో అనుష్క దెయ్యంగా కనిపించనుందని బాలీవుడ్ టాక్. రీసెంట్ విడుదల చేసి స్టిల్ కూడా అందుకు ప్రతిబింబించేలానే ఉంది.
చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. అచేతనంగా అలా పడిపోయి ఉంది అనుష్క. కాలికి గాయమై రక్తం కారుతోంది. ఒళ్లో పెన్ డ్రైవ్ పడి ఉంది. ఏదో కథ చెబుతున్నట్టుంది ఆ స్టిల్.
అనుష్క మంచి నటి మాత్రమే కాదు. మంచి నిర్మాత కూడా. తను నిర్మించిన తొలి సినిమా ‘ఎన్ హెచ్ 10’ విమర్శకుల ప్రశంసలందుకుంది. వాణిజ్యపరంగా కూడా లాభాలు తెచ్చిందా సినిమా. ఆ తర్వాత తాను నిర్మించిన ‘ఫిలౌరీ’ మూవీ కూడా ‘ఫర్లేదు’ అనిపించింది. ముచ్చటగా ఇది మూడో సినిమా అనమాట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.