హాలీవుడ్ స్టార్‌తో అనుష్క!!
on Jan 12, 2019
టాప్ హీరోయిన్ అనుష్క తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోనవెంకట్ ఈ సినిమాకు అన్నీ తానై పని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మాడ్సన్ విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన ఇంత వరకు వెలువడలేదు. అయితే ఇటీవల కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో దేవసేన అనుష్క లుక్ మా సినిమాలో అద్భుతంగా ఉండబోతుందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆగకుండా తన సినీ కెరీర్ లోనే మా సినిమా బెస్ట్ సినిమా కాబోతుందంటూ రాసుకొచ్చాడు. ఈ సినిమాకు హేమంత్ మధుకర్ డైరక్షన్ చేస్తున్నాడు. దీనికి సైలెన్స్ అనే టైటిల్ ని నిర్ణయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గోపి మోహన్ ఈ సినిమాకు కథని అందించారు. రెండేళ్ళు ఈ కథ పై వర్క్ చేసారు కోనవెంకట్. మార్చిలో షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభంకానుంది. అమెరికాలో అధికభాగం షూటింగ్ చేయనున్నారని సమాచారం.