ఫైనల్‌గా పవన్‌తో చిందులేయనున్న రంగమ్మత్త?
on Jan 20, 2021
2018 నాటి బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ జాతకమే మారిపోయింది. ఆ పిరియడ్ డ్రామాలో తను పోషించిన రంగమ్మత్త పాత్రతో.. నటిగా తన ప్రతిభ ఏంటో చెప్పకనే చెప్పింది. కట్ చేస్తే.. ఆ సినిమా తరువాత పలు ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది అనసూయ. రంగస్థలం తరువాత ఎఫ్ 2 వంటి మల్టిస్టారర్ మూవీలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడితో పాటు రంగమార్తండ, వేదాంతం రాఘవయ్య సినిమాల్లోనూ నటిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితోనూ ఓ తమిళ చిత్రం చేయబోతోంది.
ఇదిలా ఉంటే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశం అనసూయకు దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న పిరియడ్ డ్రామాలో ఒకట్రెండు సన్నివేశాలతో కూడిన ఓ ప్రత్యేక గీతంలో అనసూయ దర్శనమివ్వనుందట. సినిమాలో కీలక సమయంలో వచ్చే ఈ పాట.. సదరు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే పవన్ - క్రిష్ కాంబో మూవీలో అనసూయ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోనే అనసూయ ఇట్స్ టైమ్ టు ద పార్టీ సాంగ్ చేయాల్సింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం వదులుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత పవన్ తో నర్తించే అవకాశం దక్కడం వార్తల్లో నిలిచే అంశమే. చూద్దాం.. ఏం జరుగుతుందో?