`ఆమె`డిమాండ్ మేరకే నగ్నంగా నటించా!
on Jul 18, 2019
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అమలాపాల్. ఆమెకు వివాదాలు కొత్తేం కాదు. ఇక తాజాగా నటించిన `ఆమె` చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించింది. ఆమె పోస్టర్స్, ట్రైలర్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఇప్పటికే చాలా రోజుల నుంచి వివాదంగా మారాయి. అయితే అమలా పాల్ మాత్రం `వాటిని సమర్థించుకుంటోంది. కథలో భాగంగానే అలా నటించాను తప్ప మరో విధంగా కాదు. మీరు సినిమా చూస్తూ అలా ఎందుకు నటించాల్సి వచ్చిందో మీకు అర్ధమవుతుంది అంటూ చెప్పుకొస్తోంది. కానీ అలా నగ్నంగా నటించడం చాలా మంది వ్యతిరేఖిస్తున్నారు. ఆ నగ్న దృశ్యాలు, చిత్ర ప్రచార చిత్రాలు, పోస్టర్స్ సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇచ్చేలా ఉన్నాయి కాబట్టి, ఆమె సినిమాను నిలిపేయాలని తమిళనాడులోని ఓ మహిళ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ సినిమా పై చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళనలు చేయాల్సివస్తుందంటూ కూడా హెచ్చరించారట. సెన్సార్ జరిగింది కాబట్టి సినిమా రేపు రిలీజ్ వి షయంలో ఎలాంటి డోకా లేదు అంటున్నారు సినీ జనాలు. రిలీజ్ అయ్యాక ఎలాంటి వ్యతిరేఖత ఎదురువుతుందో అన్నది ఆమె చిత్ర యూనిట్ మొదలైంది.