కండలు పెంచితే హిట్టొస్తుందా?
on May 22, 2015
బ్యాక్ గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉండడంతో ఈజీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టేశాడు అల్లు శిరీశ్. కానీ మేటరుంటేనే కదా మెట్టేక్కేది. అంతా ఇంతా అని కబుర్లు చెప్పిన గౌరవం, కొత్తజంట హ్యాండిచ్చాయి. పోనీ చూడ్డానికైనా బాగుంటాడా అంటే అంతసీన్ లేదు. దీంతో అల్లువారి పిల్లగాడికి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అర్థమైందట. రీసెంట్ గా ఆంజనేయులు, సోలో దర్శకుడైన పరుశరామ్ కి డేట్స్ ఇచ్చాడు. అందుకే కొత్తలుక్ కోసం చాలా కష్టపడుతున్నాడట. సిక్స్ ప్యాక్ లో కనిపించాలనే ఉద్దేశంతో జిమ్ లో గంటల తరబడి చెమటోడ్చుతున్నాడట. జూన్ లో సినిమా ప్రారంభం కానుందని సమాచారం. మరి కండలు పెంచితే హిట్టొస్తుందని ఫీలవుతున్న శిరీశ్ కోరిక నెరవేరుతుందా?