ENGLISH | TELUGU  

అల్లు శిరీష్ ట్విట్టర్ కాంట్రొవర్సీ

on Apr 9, 2011

అల్లు శిరీష్ అంటే ఎవరంటే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మూడవ కుమారుడు, ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ కి తమ్ముడు.అలాంటి అల్లు శిరీష్  ఈ మధ్య తన ట్విట్టర్ లో ఒక కాంట్రొవర్సీ పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే శిరీష్ తన ట్విట్టర్ లో "శక్తి" సినిమాలో యన్ టి ఆర్ కత్తి తిప్పటం గురించి ఒక వ్యంగ్యమైన కామెంట్ రాశాడు. " శక్తి సినిమా మీద చాలా భారీ అంచనాలతో వెళ్ళాను. కానీ ఆ సినిమాలో విషయం లేదు. అయినా కండలున్న వాడికే కత్తి తిప్పే అర్హత"అని ఆ కామెంట్. ఇంతటితో ఆగకుండా ఆ పక్కనే "మగధీర" లో కత్తి పట్టిన రామ్ చరణ్ ఫొటో, "బద్రీనాథ్"లో కత్తి పట్టిన అల్లు అర్జున్ ఫొటోని పెట్టాడు.

                                                                                                          దీని మీద యన్ టి ఆర్ అభిమానులను స్పందన కోరగా "కండలుంటేనే కత్తి పట్టాలంటే అతని చిన మామయ్య పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం కండలున్నాయో కత్తి పట్టటానికి అల్లు శిరీష్ ని చెప్పమనండి. పవన్ కళ్యాణ్‍ కి ఎంతెంత పెద్ద కండలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అంటే అల్లు శిరీష్ అన్న మాట ప్రకారం ముందుగా పవన్ కళ్యాణ్ కి కత్తి తిప్పే అర్హత లేదన్నమాట. ఆ అంటే ఊ అంటే "ఖుషి" దగ్గర నుండీ "జల్సా" వరకూ తన సినిమాల్లో పెద్ద సమురాయ్ ఫైటర్లా కత్తి తిప్పుతాడు పవన్. దీనికేం చెపుతాడు అల్లు శిరీష్. గాజు ఇంట్లో ఉండి ఒకరి మీద రాయి విసరాలనుకుంటే ఇలాగే ఉంటుంది. 

 

యన్ టి ఆర్ "శక్తి" ఖర్మకాలి దిక్కుమాలిన డైరెక్టర్ వల్ల ఫ్లాపయ్యింది. అదే "శక్తి" గనక హిట్టయ్యుంటే అల్లు శిరీష్ ఈ కామెంట్ విత్ ఫొటోస్ పోస్ట్ చేసి ఉండేవాడా...? "శక్తి" సినిమా ఫ్లాపవ్వొచ్చు. కానీ నటుడిగా, ఒక హీరోగా అతని స్థాయి ఎన్నడూ ఫ్లాప్ కాదు. అతని ప్రతిభ గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా అందరీకీ తెలుసు. ఈ రోజు కొత్తగా అతని ప్రతిభ గురించి చెప్పాల్సిందేం లేదు. హీరోలన్నాక హిట్లు ఉంటాయి...ఫ్జ్లాపులూ ఉంటాయి...అంత మాత్రం చేత ఆ హీరో పనికి రాడనుకుంటే మృగరాజు, కొమరంపులి, వరుడు, ఆరెంజ్‍ సినిమాల గురించి ఏమనాలి.

 

అయినా యన్ టి ఆర్ అంత గొప్పగా అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ డైలాగ్ చెప్పగలరా...? వాళ్ళకి స్పష్టమైన తెలుగే రాదు. వాల్లు, వీల్లు అంటారే గానీ వాళ్ళు, వీళ్ళు అని ఏనాడైనా స్పష్టంగా డైలాగ్ చెప్పారా...? కనీసం చెప్పగలరా...? ఇక డ్యాన్సులు, ఫైట్లూ అంటే మా యన్ టి ఆర్ కంటే వాళ్ళిద్దరూ మొనగాళ్ళా...? అనవసరంగా ఒక హీరో మీద ఇలా చీప్ కామెంట్లు...సూటి పోటీ మాటలూ ఆడంగిలా మాట్లాడకూడదు. మా హీరో మీద ఉన్న గౌరవంతో అల్లు శిరీష్ ని ఇంతటితో వదిలేస్తున్నాం.లేదంటే నందమూరి అభిమానుల దమ్మెంతో చూడాలనుకుంటే కమాన్ రమ్మనండి. మేము రెడీ" అని రెచ్చిపోయి అంటున్నారు. మరి దీనికి అల్లు శిరీష్ ఏమంటారో...? ఎలా స్పందిస్తారో...?


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.