అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!
on Apr 8, 2019
'ఛలో' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కన్నడ భామ రష్మిక. తొలి సినిమా ఆమెకు తొలి విజయాన్ని అందించగా... రెండో సినిమా 'గీత గోవిందం' స్టార్ డమ్ తెచ్చింది. గీతగా రష్మిక అభినయానికి తెలుగు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఇప్పుడీ భామ స్టైలిష్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో రష్మిక ను కథానాయికగా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి నటిస్తున్నట్లు రష్మిక ట్వీట్ చేశారు. ఇటు హీరో అల్లు అర్జున్, అటు దర్శకుడు సుకుమార్... ఇద్దరితోనూ రష్మికకు ఇదే తొలి సినిమా. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రెండోది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో ఆమె నటిస్తున్నది. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న చిత్రమది.