టీజర్ రివ్యూ : దువ్వాడ జగన్నాథమ్
on Feb 24, 2017
సరైనోడుతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్... ఈసారి డీజేగా మారిపోయాడు. దువ్వాడ జగన్నాథమ్ అంటూ స్టైలీష్ స్టార్ కాస్తా.. సంప్రదాయ బ్రాహ్మణుడి అవతారం ఎత్తాడు. దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా టీజర్ విడుదలైంది. బన్నీ లుక్, డైలాగ్ డెలివరీ, నడక,నటన... అన్నీ కొత్తగా కనిపించాయి ఈ టీజర్లో. ఆర్.ఆర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ తన మెరుపులు చూపించాడు.
ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ.. బన్నీ పేల్చిన ఒకే ఒక్క డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ మొత్తం బన్నీ క్యారెక్టరైజేషన్‌కీ, ఈ సినిమాలో పండ బోతున్న కామెడీకీ బీభత్సమైన హింట్లా కనిపించింది. పూజా హెగ్డే అయితే.. ఈ సినిమాలో తన గ్లామర్ ప్రతాపం చూపించడానికి రెడీ అయిపోయినట్టు అనిపిస్తోంది. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్‌కే కాదు. టాలీవుడ్ మొత్తానికి ఈ డీజే టీజర్ పుష్కలంగా ఆకట్టుకోవడం ఖాయంగా అనిపిస్తోంది. అప్పుడే.. హిట్ సినిమా లక్షణాలు కనిపించేస్తున్నాయి. ఈ సమ్మర్‌కి బన్నీ సెగ పుట్టించడం ఖాయం.