English | Telugu

బ‌న్నీ బేబి ఫ‌న్నీ డైలాగ్స్!!!

on Feb 9, 2019

అల్లు అర్జున్ ప్ర‌జంట్ ఫుల్ ఫ‌న్ అండ్ రెస్టింగ్ మోడ్ లో ఉన్నాడు. అవును `నా పేరు సూర్య‌` ఫ్లాప్ త‌ర్వాత ల్యాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవ‌లే త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు కోసం డిఫ‌రెంట్ గా మేకోవ‌ర్ అవుతోన్నాడు బ‌న్ని. ఇక ఫ్రీ టైమ్ లో ఫ్యామిలీతో ఫుల్ టైమ్ గ‌డుపుతున్నాడు బ‌న్ని. రీసెంట్ గా బ‌న్ని తన కూతురు అర్హ‌తో అల్లు అర్జున్ ఓ క్యూట్ సంభాష‌ణ జ‌రిపిన వీడియో ప్ర‌జంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.  అర్హ‌తో జ‌రిపిన క్యూట్ క్యూట్ సంభాష‌ణ‌ను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసాడు బ‌న్ని.  వీడియోలో `నేను  చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బ‌న్ని ప్ర‌శ్నించ‌గా దానికి అర్హ `చేసకోను అని బుల్లి బుల్లిగా బ‌దులిస్తుంది. దీంతో బ‌న్ని `దొంగ ఫెల్లో ` అంటూ ముద్దు చేస్తాడు. ఇక ఈ వీడియో అభిమానుల‌కు మాత్ర‌మే కాకుండా ప్ర‌తి ఒక్క‌రికీ  తెగ న‌చ్చేస్తుంది.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here