Home

»

Latest News

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా జూలైలో

Jun 17, 2011 11:12AM

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా జూలైలో ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ హీరోగా, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓక సినిమా జులైలో మొదలవబోతోందని తెలిసింది. ముందుగా విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని వినపడింది. కాని మళయాళంలో సుపర్ హిట్టయిన "బాడీ గార్డ్" అనే సినిమాని తెలుగులో వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఆ సినిమాతో వెంకటేష్ బిజీ అయిపోయారు.

ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందని వినపడినా, అది కుడా క్యాన్సిల్‍ అవటంతో, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దృష్టంతా అల్లు అర్జున్ హీరోగా నటించబోయే సినిమా మీదే కేంద్రీకరించారట. ఈ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రాబోయే సినిమా జులై నేలలో ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఈ సినిమాలో నలకనడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా నటించనుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com