బన్ని సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!!
on May 11, 2019
`జులాయి`, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇది బన్ని 19వ చిత్రం. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఫస్ట్ షెడ్యూల్ లో హీరోకు సంబంధించి కీలక ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేసినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రెండో షెడ్యూల్ లో ఆమె జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. డిజే తర్వాత ఈ జోడి కలిసి మరో సారి నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది కాబట్టి బన్ని ఈ గ్యాప్ లో సుకుమార్ సినిమాను లాంఛనంగా ప్రారంభించే అకాశాలున్నట్లు తెలుస్తోంది.