English | Telugu

హరితేజాకు స్టేజ్ పైనే వార్నింగ్ ఇచ్చిన బన్నీ!

on Dec 27, 2017


సినిమా ఫంక్షన్లలో యంకరమ్మలు చేసే హడావిడీ అంతాఇంతా కాదు. నోరు తెరిస్తే అబద్దాలే. ఒకే యాంకర్ ... అవే పొగడ్తలు... హీరోలు మారతారు.. వేడుకలు మారతాయ్. జనాలు కూడా ఈ దారుణాలను చూసీ చూసీ... విసిగెత్తిపోయారు. ఏ హీరో ఫంక్షన్ అయితే... ఆ హీరోని పొగిడేస్తూ.. భట్రాజుల్ని తలదన్నేస్తున్నారు మన యాంకరమ్మలు మరి ఆ విషయం జనాలకేనా అర్థమయ్యేది! హీరోలకు కూడా అర్థమవుతుంది కాదా! అందుకే... ‘ఒక్కక్షణం’ ఆడియో వేడుకలో యాంకర్ గా వ్యవహరించిన హరితేజకు మాం...చి ‘ఝలక్’  ఇచ్చేశాడు బన్నీ. అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ ఆడియో వేడుకకు అల్లు అర్జున్ ఛీప్ గెస్ట్ గా హాజరయ్యాడు. బన్నీ వేదిక దగ్గరకు రావడం ఆలస్యం... హరితేజ పొగడ్తలు మొదలెట్టేసిందీ... ‘నువ్వు అయి పీకినవో... నువ్వు ఇవి పీకినవో‘ అంటూ స్తోత్రాలు ప్రారంభించింది.

బన్నీ అవన్నీ గమనిస్తూ కూర్చున్నాడు. చివరకు బన్నీని డయాస్ మీదకు పిలిచి డైరెక్ట్ గానే బిస్కెట్లు వేయడం మొదలుపెట్టింది. నేను మీ అభిమానండీ...‘ అంటూ బన్నీ దగ్గర మార్కులు కొట్టేయడానికి చూసింది. మరి అల్లు వారబ్బాయ్ మామూలు వ్యక్తా... ఇలాంటివి ఎన్ని చూసుంటాడు? ‘నువ్వు నా అభిమానివి కదా. ఇదే మాట.. నువ్వు ఎక్కడ యాంకరింగ్ చేసినా చెప్పాలి. ఇంకో హీరో ఫంక్షన్లో ఆ హీరోకి ఇదే మాట చెప్పినట్టు కనిపించిందో.. డైరెక్ట్ గా ఫోన్ చేసి అడుగుతా’ అని బన్నీ అనేసరికి... హరితేజా గతుక్కుమంది. వెంటనే తేరుకొని... ‘ఎక్కడకెళ్లినా ఇదే మాట చెబుతానండీ... నేను మీ అభిమానిని’ అని గట్టిగానే మాటిచ్చేసింది. మరి ఆ మాటను హరితేజా ఏ మాత్రం నిలబెట్టుకుంటుందో చూడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here