మార్చిలో బన్ని మొదలెడుతున్నాడు!!
on Jan 12, 2019
అల్లు అర్జున్ హీరోగా తివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. `జులాయి` సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాల విజయాల తర్వాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా ఇది. అయితే ఈ సినిమా మార్చి నుంచి షూట్ కి వెళ్లబోతున్నట్లు సమాచారం అందుతోంది. గత చిత్రాలకంటే కూడా ఈ చిత్రం కాన్సెప్ట్ విభిన్నంగా ఉండనుందట. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత ఓ సక్సెస్ ఫుల్ సినిమా చేయాలని వెయిట్ చేసిన బన్నీకి త్రివిక్రమ్ ఓ మంచి సక్సెస్ ఇవ్వబోతున్నాడంటూ చిత్ర యూనిట్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకోసం కియారా అద్వానిని హీరోయిన్ గా తీసుకున్నారంటూ వార్తలు హల్ చల్ చేసాయి. త్వరలో అధికారికంగా దర్శక నిర్మాతలు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. `వినయ్ విధేయ రామ` చిత్రంలో తాజాగా నటించించి కియారా. మరి ఈ సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కియారా స్ర్కీన్ ప్రజెన్స్ మాత్రం అద్భుతంగా ఉందంటూ రివ్యూస్ వచ్చాయి. మార్చిలో సినిమాను ప్రారంభించి ఈ ఏడాదే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.