ఆలీ ఒక్కడే దొంగ
on Jun 11, 2013
హాస్య నటుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి, నటుడిగా మారి సుమారు 500లకు పైగా చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు ఆలీ. హీరోగా మారి పలు చిత్రాలలో నటించిన ఆలీ, 'సోంబేరి' చిత్రం తర్వాత మళ్ళీ హీరోగా రాబోతున్నాడు. ఆలీ హీరోగా "ఆలీబాబా ఒక్కడే దొంగ" అనే చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం జూన్ 18న సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని శివాజీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉంటుందని చిత్ర యునిట్ పేర్కొన్నారు.