బాలీవుడ్ `లక్ష్మీబాంబ్`
on Apr 26, 2019
లేటెస్ట్ గా విడుదలైన రాఘవ లారెన్స్ కాంచన-3 చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని సినిమా సీక్వెల్ లో భాగంగా వచ్చిన కాంచన, గంగ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. కాంచన -3 కూడా మంచి విజయం సాధించింది. అయితే కాంచన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రీమేక్ లో అక్షయ్ కుమార్ నటించనున్నారని సమాచారం. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుందన వినికిడి.
అయితే ఈ సినిమాలో ఒక శరత్ కుమార్ ఒక పవర్ పుల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకోసం ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ నటులను సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే శరత్ కుమార్ నే తీసుకోవాలన్న ఆలోచనతో కూడా ఉందట చిత్ర యూనిట్. త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఒక ఇంట్రెస్టెంట్ పెట్టనున్నారట. అదే `లక్ష్మీబాంబ్`. త్వరలో ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. కాంచన సినిమా 2011 లో విడుదలై సంచలనం సృష్టించింది. మరి బాలీవుడ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకోనుందో మరి. ఒక వేళ సక్సెస్ అయితే వరుస సీక్వెల్స్ లో ప్లాన్ చేసే అవకాశాలున్నాయి లారెన్స్.