ఈ వేసవిలో సందడంతా అక్కినేని హీరోలదే
on Jan 23, 2021
2021 వేసవి అక్కినేని అభిమానులకు ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సమ్మర్ సీజన్ లో ఈ ఫ్యామిలీ హీరోలు కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, యంగ్ హీరో అఖిల్.. ముగ్గురు కూడా తమ సినిమాలతో సందడి చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. నాగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్.. వేసవిలో సందడి చేయనుంది. కుదిరితే థియేటర్స్ లో లేదంటే ఓటీటీలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక చైతూ విషయానికి వస్తే తన తాజా చిత్రం లవ్ స్టోరీ మార్చి 26న లేదంటే ఏప్రిల్ 2న థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని వినిపిస్తోంది. ఇక అఖిల్ విషయానికి వస్తే.. కథానాయకుడిగా తను నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మే నెలలో విడుదల కానుందని సమాచారం. త్వరలోనే ఆయా చిత్రాల విడుదల తేదీలకి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. మరి.. అక్కినేని హీరోల వేసవి సందడి ఏ స్థాయిలో రంజింపజేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, వైల్డ్ డాగ్ ని అహిషోర్ సల్మాన్ డైరెక్ట్ చేస్తుండగా.. లవ్ స్టోరీకి శేఖర్ కమ్ముల దర్శకుడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు.