సుకుమార్ కథ.. అఖిల్ 21 ఎమ్..!!
on Aug 4, 2018
అక్కినేని వారసుడు అఖిల్.. మొదటి సినిమా 'అఖిల్' తో తీవ్ర నిరాశ పరిచాడు.. ఆ తరువాత ఆచితూచి అడుగులు వేసి 'హలో' అంటూ పలకరించి పర్లేదు అనిపించుకున్నాడు.. ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా అనంతరం అఖిల్, సుకుమార్ తో జత కట్టబోతున్నట్టు తెలుస్తోంది.. అయితే సుకుమార్ ఈ సినిమాకి దర్శకుడు కాదు రచయిత మాత్రమే.. గతంలో సుకుమార్ రచయితగా, నిర్మాతగా 'కుమారి 21 ఎఫ్' సినిమా వచ్చి విజయం సాధించింది.. ఈ సినిమాకి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.. ఇప్పుడు అఖిల్ సుకుమార్ ల కలయికలో వస్తున్న సినిమాకి కూడా సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, అన్నపూర్ణ స్డూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం.