శ్రియా భూపాల్ గురించి నమ్మలేని నిజాలు
on Feb 24, 2017
అఖిల్ నిశ్చితార్థం కాన్సిల్ అవ్వడం, పెళ్లి ఆగిపోవడం... ఈ షాక్ నుంచి టాలీవుడ్ ఇంకా తేరుకోలేదు. అసలేం జరిగి ఉంటుంది? ఈ టోటల్ ఎపిసోడ్లో తప్పెవరిది?? అనే హాట్ టాపిక్ కొనసాగుతూనే ఉంది. అక్కినేని ఫ్యామిలీకి పెళ్లి ఇష్టమేనని, శ్రియా భూపాల్ ఇంట్లోంచే సమస్యలు వస్తున్నాయని ఓ వెర్షన్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మరో వెర్షన్ బయటకు వచ్చింది. శ్రియా భూపాల్ వ్యవహార శైలి నచ్చకే నాగ్ ఈ పెళ్లి క్యాన్సిల్ చేశాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అఖిల్ ప్రియురాలు శ్రియాపై నమ్మలేని సంగతులు బయటకు వస్తున్నాయి.
అఖల్ - శ్రియా భూపాల్ నిశ్చితార్థం జరిగిన రోజున... శ్రియ చాలా అబ్నార్మల్గా ప్రవర్తించిందని టాక్. అఖిల్ ఇంట్లోవాళ్లని ఏమాత్రం పట్టించుకోలేదని, వాళ్లకు సరైన మర్యాద ఇవ్వలేదని తెలుస్తోంది. ఇటీవల సుబ్బిరామిరెడ్డి ఇంట్లో ఓ పెళ్లి జరిగింది. ఆ కార్యక్రమానికి నాగ్ తన ఫ్యామిలీతో సహా హాజరయ్యాడు. అక్కడ శ్రియా భూపాల్ ప్రవర్తించిన తీరు.. నాగ్‌కి ఏమాత్రం నచ్చలేదట. శ్రియాకీ నాగ్ కీ మధ్య ఓ విషయంలో చిన్న గొడవ మొదలైందని, అదే చివరికి గాలివానగా మారిందని, అదే రోజున నాగ్.. ఈ పెళ్లి ఆగిపోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చాడని టాక్ వినిపిస్తోంది.
శ్రియా భూపాల్ ప్రవర్తనపై అఖిల్ కూడా చాలా గుర్రుగా ఉన్నాడని, ఈ విషయంలో నాన్నని సమర్థించక తప్పలేదని, అఖిల్ తో మాట్లాడిన తరవాతే.. నాగ్ ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ జీవీకే ఫ్యామిలీకి మెసేజ్ అందించాడని చెప్పుకొంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటన్నది అటు నాగార్జున ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు జీవీకే ఫ్యామిలీ నుంచి గానీ ఎవరో ఒకరు నోరు విప్పితే గానీ తెలీదు.