`అఖిల్ 5`.. టైటిల్, ఫస్ట్ లుక్ అప్పుడేనా?
on Apr 5, 2021
అక్కినేని బుల్లోడు అఖిల్ కథానాయకుడిగా నటించిన నాలుగో సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`.. జూన్ 19న విడుదలకు సిద్ధమైంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా దర్శనమివ్వనున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` విడుదలయ్యేలోపే అఖిల్ 5వ చిత్రం పట్టాలెక్కనుంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందించనున్న ఈ చిత్రంలో అఖిల్ కి జోడీగా సాక్షి వైద్య సందడి చేయనుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనుంది. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని అఖిల్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా రివీల్ చేయబోతున్నట్లు టాక్.
మరి.. అఖిల్, సూరి ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ డ్రామా.. అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని, గుర్తింపుని అందిస్తుందో చూడాలి.
Also Read