ఈ డైలాగులు అజ్ఞాతవాసివైతే హిట్టే..?
on Dec 19, 2017
పవన్ సినిమా అంటే ఎప్పుడూ హాట్ కేకే.. అది వెండితెరైనా, బుల్లితెరైనా, డిజిటల్ మీడియా అయినా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే.. ఎందుకంటే ఆ నేమ్కున్న క్రేజ్ అలాంటిది. ఈ క్రేజ్‌ను మంచితో పాటు చెడు కూడా క్యాష్ చేసుకుంటూ ఉంటుంది. పవన్ మీద నమ్మకంతో నిర్మాతలు కోట్లు పోసి సినిమాలు నిర్మిస్తుంటే.. కొందరు లీకేజ్ రాయుళ్లు మాత్రం ఆయా సినిమాలను రిలీజ్‌కు ముందే లీక్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అది వీడియోలు కావొచ్చు.. డైలాగ్స్ కావొచ్చు. గతంలో అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల సమయాల్లో ఎంత రచ్చ జరిగిందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అజ్ఞాతవాసి.
ఈ మూవీపై అటు ఇండస్ట్రీతో పాటు ఇటు అభిమానుల్లోనూ ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు రీసెంట్గా రిలీజైన టీజర్‌తో అంచనాలు ఓ రేంజ్‌కు పెరిగిపోయాయి. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పవన్‌ను స్టైలిష్‌గా చూపించాడు.. సినిమాలోని మిగిలిన క్యారెక్టర్లు డైలాగ్స్ పలికితే కళ్యాణ్‌కు మాత్రం ఎలాంటి డైలాగ్స్ పెట్టలేదు. దీంతో అజ్ఞాతవాసిలోని డైలాగులు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. అవి ఈ సినిమాలోనివా...? లేదంటే పుకారు రాయుళ్లు పుట్టించినవో తెలియదు కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం వీటిని తెగ షేర్ చేస్తున్నారు.
అవేంటో ఒకసారి చూస్తే:
- మనకు తెలిసింది అవతలి వాళ్లకు పరిచయం చెయ్యాలి
మనకు తెలియంది పరిచయం చేసుకోవాలి
- నా కోపానికి మార్కులు ఉండవు
ఒక వేళ ఉంటే మాత్రం వందకు వంద ఉంటాయి పిన్ని
- నవ్వంటే సంతోషం అనుకునే లోపే
ఏడుపంటూ ఒకటుందని గుర్తు చేస్తుంది జీవితం అభిజిత్
- ఒకడిని తోక్కేయ్యడాన్ని పాలిటిక్స్ అనరు
ఒకడికోసం బ్రతకడాన్ని పాలిటిక్స్ అంటారు
- ముందు ఓడిన వాడు గెలవడం సులువు
కాని గెలిచిన వాడు మళ్ళీ గెలవడం ఖాయం
- అవసరం కోసం అబద్ధాలు చెప్పేవాడికి
నిజాయితీగా నిజాలు చెప్పేవాడికి చాలా తేడాలు ఉంటాయి సార్