‘అజ్ఙాతవాసి‘ కథ లీక్ చేశారు...
on Dec 1, 2017
పవర్ స్టార్ కథంటే... ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఆకాశమంత ఎత్తులో ఉండాలి. కేరక్టరైజేషన్ దాదాపు దేవుడితో సమానంగా ఉండాలి. అప్పుడుగానీ అభిమానులకు ఆనదు. రేపు సంక్రాంతికి ‘అజ్ఙాతవాసి’ గా పవర్ స్టార్ రాబోతున్నాడు. మరి ఆ సినిమా కథ ఎలా ఉంటుంది? దర్శకుడు త్రివిక్రమ్ ఎలాంటి కథను ఎంచుకొని ఉంటాడు? అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తున్న అంశం. ఈ ఉత్కంఠకు తెర దించుతూ... తెలుగువన్ మీకు ఎక్స్ క్లూజీవ్ గా ‘అజ్ఙాతవాసి’ కథ చెబుతుంది. తెలుసుకొని ఎంజాయ్ చేయండి.
ఆయన వేల కోట్లకు అధిపతి. కోరుకుంటే చంద్రమండలంలో డిన్నర్ చేయలడు. అంతరిక్షంలో విహరించగలడు. కానీ ఆ సంపదను తన తర్వాత అనుభవించడానికి సంతానమే లేడు. ఆయన జీవితంలో పెద్ద వెలితి ఇది. ఆనాథ శరణాలయం నుంచి ఓ బాబును తెచ్చుకుంటాడు. ఆస్తి కోసం గోతి కాడ నక్కల్లా వేచిచూస్తున్న విలన్లు... ఆ బాబును పొట్టన పెట్టుకుంటారు. ఈ విషయం ఆయనకు అర్థమై... ప్రపంచానికి కూడా తెలీకుండా ఓ పని చేస్తాడు. అదేంటంటే... ఆనాధ శరణాలయం నుంచి మరో బిడ్డను దత్తత తీసుకొని ప్రపంచానికి తెలీకుండా ఆ బిడ్డను పెంచుతాడు. అయితే... ఉన్నట్టుండి... ఓ రోజు ఆ పెద్దాయన కాలం చేస్తాడు. అప్పుడు విలన్ల ప్లాన్ లో భాగంగా ఓ కుర్రాడు...‘ నేనే ఆయన పెంపుడు కొడుకుని’ అని ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ కుర్రాడ్ని అడ్డం పెట్టుకొని ఆ ఆస్తి కాజేయాలనేది ఆ దుండుగుల ప్లాన్. ఈ తరుణంలో... ‘అజ్ఙాతవాసి’గా పెరిగిన అసలు కొడుకు ఎంటరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ’అజ్ఙాతవాసి’ తన ఆస్తిని ఎలా కాపాడుకున్నాడు? తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు? అనేదే మిగిలిన కథ.
వైరైటీగా ఉంది కదా కథ!. మరి ఈ కథలో ఏ విధమైన సీన్లు పడ్డాయో... ఏ విధంగా పవర్ స్టార్ కేరక్టరైజేషన్ ఉంటుందో... డైలాగులు, పాటలు.. ఎలా ఉంటాయో.. తెలుసుకోవాలంటే... సంక్రాతి దాకా ఆగాలి మరి.