English | Telugu

ఇళయరాజా క్లాప్‌తో `క్లాప్ ` ఆరంభం!!

on Jun 12, 2019

విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న  ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే "క్లాప్" చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో ఆది హీరోగా  నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య  దర్శకుడిగా  బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా "క్లాప్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా   ఈ చిత్రం జూన్ 12న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్,  హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా ఏస్ -ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. "క్లాప్" బౌండెడ్ స్క్రిప్టు ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ చిత్ర యూనిట్ కు అందించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్, దర్శకుడు పృథ్వీ  ఆదిత్య, నిర్మాతలు ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు, నటి క్రిష  కురుప్, డిఒపి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here