అమిర్ ఖాన్ తొలి పారితోషికం ఎంతో తెలుసా!
on May 29, 2018
అమిర్ ఖాన్ హీరోగా అడుగుపెట్టి 30 ఏళ్లు గడిచిపోయాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో చిన్నాచితకా వేషాలు వేస్తూ, అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తూ ఉన్న అమిర్... ఖయామత్ సే ఖయామత్తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మరిన్ని సినిమాల్లో హీరోగా చేసి, తన ప్రతిభని నిరూపించుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇంతకీ ఆమిర్ తన తొలి సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ లో ఎంత పారితోషికాన్ని తీసుకున్నాడో తెలుసా! కేవలం 11 వేలు. దాంతో సొంత కారు కూడా కొనుక్కోలేక చాలారోజులు బస్సులోనే ప్రయాణించేవాడట. ఇంతకీ ఇప్పుడు ఆమిర్ పారితోషికం ఎంత ఉంటుందంటారు? బహుశా దానికి మాత్రం ఆమిర్ జవాబు చెప్పకపోవచ్చు!