ఆదిపినిశెట్టి అథ్లెట్ గా వస్తున్నాడు!!
on May 7, 2019
ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్నమైన కథలు, క్యారక్టర్స్ ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ఆది పినిశెట్టి. లేటెస్ట్ గా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఫిలింకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పృథ్వీ ఆదిత్య అనే అతడు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. స్పోర్ట్స్ జానర్ సినిమాలో ఆది పినిశెట్టి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో బైలింగ్వెల్ గా రూపొందిస్తున్నారు. ఆది అథ్లెట్ అవ్వాలని తన కన్న డ్రీమ్ కోసం హీరో ఏ విధంగా ప్రయత్నం చేసాడు అనేది సినిమా కథం. ఈ సినిమా అథ్లెటిక్స్ పై ఇంట్రస్ట పెంచేలా ఉంటుంది. మిగతా క్యారక్టర్స్ ను ఎంపిక చేసే పనిలో బిజీ గా ఉన్నారు దర్శక నిర్మాతలు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ బేనర్ పై ఐబీ కార్తికేయన్ గా ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.