'అరవింద సమేత' పై ఏపీ ప్రేమ
on Oct 9, 2018
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' దసరా కానుకగా ఈ నెల 11 న విడుదల కానుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందిన 'అరవింద సమేత' అనుకున్నట్టుగానే 11 న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు 'అరవింద సమేత' తో ఎన్టీఆర్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. అరవింద సమేత 2 రోజులు, 3 రోజులు కాదు ఏకంగా 8 రోజుల పాటు రోజుకు 6 షోలు వేసుకోవచ్చని ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రిలీజ్ రోజు నుంచి 18న తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య అదనంగా 2 షోలు వేసుకోవచ్చు. అసలే ఆకాశాన్ని తాకే అంచనాలు.. మరోవైపు దసరా సెలవులు.. వీటికి తోడు 8 రోజుల పాటు రోజూ అదనంగా 2 షోలు. ఇక అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కడతారేమో. మరి 'అరవింద సమేత'తో ఎన్టీఆర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.