మూడు ఐటమ్ సాంగ్స్ అదిరాయి
on Jan 15, 2021
ఈ సంక్రాంతికి విడుదలైన మూడు స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్స్ కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే.. అది ఐటమ్ సాంగ్ ఉండడం అనే చెప్పాలి. క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్.. ఇలా ఈ ముగ్గుల పండక్కి వచ్చిన మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ లోనే తెరకెక్కాయి. అయితే, అన్నింటిలోనూ ఐటమ్ సాంగ్ కి స్థానం దక్కింది. విశేషమేమిటంటే.. ఆయా చిత్రాల టాక్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ క్లిక్ అయ్యాయి.
క్రాక్ లో బూమ్ బద్ధల్ అంటూ మాస్ మహారాజా రవితేజతో కలసి అప్సర రాణి చిందేసిన ఐటమ్ సాంగ్.. ఆ సినిమా ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా నిలిస్తే.. రెడ్ చిత్రంలో డించక్ డించక్ అంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో హెబ్బా పటేల్ ఆడిపాడిన ప్రత్యేక గీతం కుర్రకారుని ఊపేస్తోంది. ఇక అల్లుడు అదుర్స్ లో బిగ్ బాస్ సీజన్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్.. రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపితే నేనిక అంటూ చిందులేసి.. ఆ ఐటమ్ సాంగ్ ని సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిపింది.
మొత్తంగా.. 2021 సంక్రాంతి కోడిపుంజులు.. ఐటమ్ సాంగ్స్ తో రచ్చ చేశాయనే చెప్పాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
