'ఆర్జీవీ'లో "దయ్యంతోనే అన్నీ చెయ్యాలనుకుంటాడే వీడు.." లిరికల్ సాంగ్ వచ్చేసింది
on Aug 10, 2020
ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్జీవీ'లో రెండో లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. "దయ్యంతోనే అన్నీ చెయ్యాలనుకుంటాడే వీడు.. కల్లోకొచ్చిన కాష్మారాతో కక్కుర్తి పడతాడు.." అంటూ ఆర్జీవీ క్యారెక్టరైజేషన్ ఏమిటో ఈ పాట వ్యంగ్యంగా తెలియజేస్తోంది. 'రోజూ గిల్లే వాడు' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినికార్ప్ సమర్పణలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, తేజ కీలక పాత్రధారులు.
ఆగస్ట్ 9 ఆదివారం, అర్ధరాత్రి, మణికొండ మర్రిచెట్టు కింద, తెలుగువన్ ఛానల్ చైర్మన్ రవిశంకర్ ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని మొదటి పాట "వోడ్కా మీద ఒట్టు.." విడుదలైన 2 వారాల్లోనే యూట్యూబ్ లో 20 లక్షలమంది పైగా విని ఆనందించారు. తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తెలుగుసినీపరిశ్రమనే అవమానిస్తున్న 'తగుల్భాజీదర్శకదయ్యం' 'నమక్ హరాం' ఘోపాలవర్మకి ఈ రెండో పాటని అంకితం ఇచ్చినట్లు కవి, దర్శకుడు జొన్నవిత్తుల తెలియచేశారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు.
సాంకేతిక బృందం:
ఛాయాగ్రహణం: వేదాంత్ మల్లాది
కూర్పు: కార్తీక శ్రీనివాస్
కళ: కృష్ణ చిత్తనూర్
పబ్లిసిటీ: ధనీ ఏలే
పీఆర్వో: మధు మాడూరి
సంగీతం: వీణాపాణి
సమర్పణ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం
నిర్మాత: బాల కుటుంబ రావు పొన్నూరి
కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.
Also Read