ENGLISH | TELUGU  

రివైండ్ 2016: ముఖం చాటేసిన హీరోలు

on Dec 10, 2016

క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలుగా విడిపోయి..కాలగతిలో మరో ఏడాది కనుమరుగుకానుంది..ఈ సంవత్సరం ప్రతీ రంగంలోని ప్రముఖులకు తీపి, చేదు గుర్తులు వున్నాయి. అది సినీరంగానికి కూడా వర్తిస్తుంది. ఈ ఏడాది పొడుగునా వందల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. బద్ధకం వదిలిన పెద్ద హీరోలు జూలు విదిల్చడంతో సినిమాల స్పీడు పెరిగింది..అందుకే ఏ ఒక్కరి కాల్షీట్లు ఖాళీగా లేవు..ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ కొందరు మాత్రం అభిమానులకు ముఖం చాటేశారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో తెరముందుకు రానీ స్టార్స్ ఎవరో ఓ లుక్కెద్దాం.

రవితేజ: ఈ లిస్ట్‌లో అందరికంటే టాప్‌లో ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అప్పుడెప్పుడో 2015లో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన బెంగాల్ టైగర్ తర్వాత రవి ఏ సినిమాకు కమిట్ కాలేదు. సినిమా ప్రారంభించకున్నా త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను అనే ప్రకటన కూడా రవితేజ చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు.. ఇదంతా ఒక ఎత్తైతే పలు అనుమానాలకు కారణమయ్యాడు రవి.  అనారోగ్యం కారణంగానే ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. కొందరైతే ఇకపై రవితేజ సినిమాల్లో నటించడు అంటున్నారు. మరి వచ్చే ఏడాదైనా తనమార్క్ విందుభోజనంతో అభిమానులకు రావాలని ఆశిద్దాం.

గోపిచంద్: మాస్, యాక్షన్ మూవీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌ లాంటి గోపిచంద్ సౌఖ్యం తరువాత మరో సినిమా ఏది విడుదల చేయలేదు. ప్రస్తుతం ఎ.ఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ అనే చిత్రం చేస్తున్నారు గోపి. ఆల్‌మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. ఆ వెంటనే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లోనే విడుదల చేద్దామనుకొన్నారు..కానీ కుదర్లేదు. ఆక్సిజన్‌తో పాటుగా బి.గోపాల్, సంపత్ నంది సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అంటే వచ్చే ఏడాది మూడు సినిమాలతో ఆ లోటును పూడ్చేస్తాడన్నమాట గోపిచంద్.

ప్రభాస్: అందరి హీరోల సంగతి పక్కనబెడితే ఈ ఏడాది నా సినిమా రాదని ముందే ప్రకటించిన హీరో ప్రభాస్. ఈ విషయం అభిమానులకు కూడా తెలుసు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలితో యంగ్‌రెబల్ స్టార్ ఇంటర్నేషనల్ హీరోగా మారిపోయాడు..ఆ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి-2 షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభమవ్వడంతో ప్రభాస్ ఫుల్ బిజీ..దానికి తోడు బాహుబలి ప్రాజెక్ట్ పూర్తయ్యేంతవరకు మరో సినిమా ఒప్పుకోకూడదని బలమైన నిర్ణయం తీసుకోవడం కూడా ఒక కారణం. 2017 ఏప్రిల్‌లో బాహుబలి-2 వచ్చేస్తోంది. అదే ఏడాది సుజిత్ దర్శకత్వంలో నటించే సినిమా కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్.


రానా: అచ్చం ప్రభాస్ లాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు దగ్గుబాటి వారి వారసుడు రానా. బాహుబలి కోసం భారీగా కసరత్తు చేసి శరీరాన్ని పెంచాడు. వేరే సినిమాకి కమిట్ అవుదామంటే... ఈ పర్సనాలిటీతో కుదరదు. అందుకే ప్రస్తుతానికి బాహుబలి మీదే ఫుల్ కాన్సన్‌ట్రేషన్ చేశాడు రానా..అయినప్పటికీ "బెంగళూరు నాటకల్" అనే తమిళ సినిమాలో కామియో అప్పిరెన్స్ ఇచ్చి అభిమానులను పలకరించాడు.


అఖిల్ అక్కినేని: ఎన్నో అంచనాల మధ్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్..వారసుడి ఎంట్రీ కాబట్టి కథల విషయంలో ఎన్నో తర్జనభర్జనలు, మరెన్నో జాగ్రత్తలు తీసుకున్నారు నాగార్జున..చివరకు వివి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు అఖిల్..కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెండో సినిమా విషయంలో మరింత ఆలస్యమైంది..ఆ ఆలస్యం అఖిల్‌ను 2016లో సినిమా రిలీజ్ చేయకుండా చేసింది..ఈ క్రమంలో అఖిల్-శ్రేయ భూపాల్ లవ్ స్టోరీ బయటకు రావడం..పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తదితర కారణాలతో సంవత్సరం పూర్తయ్యింది..అయితే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమా పట్టాలెక్కనుంది. అంటే అఖిల్ వచ్చే ఏడాది అభిమానులకు రెండు కానుకలు ఇవ్వబోతున్నమాట. ఒకటి తన పెళ్లి, రెండోది రెండో సినిమా.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.