'సైరా'లో ఆయుధాలకు అంత ఖర్చు పెట్టారా?
on Sep 11, 2019
భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటీషర్లపై యుద్ధం చేసిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అతడి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో యుద్ధ సన్నివేశాల కోసం అప్పటి ఆయుధాలను పునఃసృష్టించారు. తుపాకులు, ఫిరంగులు... ప్రతిదీ పక్కాగా డిజైన్ చేశారు. యుద్ధ సన్నివేశాల్లో ఉపయోగించే ఆయుధాలను తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ చెప్పినదాని ప్రకారం రెండు మూడు చిన్న సినిమాలు తీయొచ్చు. దగ్గర దగ్గరగా 20, 30 కోట్లు ఖర్చు చేసి ఉంటారు. 'సైరా' కోసం తయారు చేసిన ఫిరంగులతో భారీ భవనాలను ధ్వంసం చేయవచ్చని అయన చెబుతున్నారు. సినిమా కోసం మొత్తం 42 సెట్స్ వేశారట. అందులో 15 పెద్దవి. ముఖ్యంగా ఒక నౌకాశ్రయం, జగన్నాథ ఆలయం, సైరా నివసించే రాజభవనం, బ్రిటిషర్ల కోట వంటివి ముఖ్యమైనవి. ఉయ్యాలవాడ పాలించిన 64 గ్రామాల్నీ సినిమా కోసం పునఃసృష్టించారు. ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యంగా, నిజమైనవి అన్నట్టు తీర్చిదిద్దారట.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
